BRO నుండి సాయిధరమ్ తేజ్ లుక్

BRO నుండి సాయిధరమ్ తేజ్ లుక్
BRO

తమిళ దర్శకుడు సముద్రఖని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా ముల్టీస్టారర్ గా తీస్తున్న చిత్రం “BRO”… ఈ టైటిల్ ను ఈ మధ్యనే చిత్ర యూనిట్ ప్రకటించిది.

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో పవన్ తో నటిస్తున్న మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పాత్రా గురించి పరిచయం చేస్తూ కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ మార్కండేయులు అన్న పాత్రలో నటిస్తున్నాడు అని తెలుస్తుంది . ఈ పోస్టర్ లో మార్కండేయులు గా సాయి ధరమ్ తేజ్ వైట్ అండ్ వైట్ ప్యాంటు షర్ట్ లో కనిపిస్తున్నాడు .

కాగా ఈ సినిమా జులై 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్ ఎస్ థమన్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.