పవన్ సినిమాకు కొరియోగ్రాఫర్ గా బన్నీ.. ఏ సాంగ్ కి అంటే..?

పవన్ సినిమాకు కొరియోగ్రాఫర్ గా బన్నీ.. ఏ సాంగ్ కి అంటే..?
Latest News

అల్లు అర్జున్ డాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన నటనతో డాన్స్ తో అదరగొడుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కి మామూలు క్రేజ్ ఉండదు. పవన్ కళ్యాణ్ కి అభిమానులు బాగా ఎక్కువ. పవన్ కళ్యాణ్ సినిమాలు నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న భారీ కలెక్షన్లు రాబడతాయి అందులో సందేహం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వంతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.

పవన్ సినిమాకు కొరియోగ్రాఫర్ గా బన్నీ.. ఏ సాంగ్ కి అంటే..?
Pavan Kalyan

పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో గుడుంబా శంకర్ సినిమా కూడా ఉంది. మీరా జాస్మిన్ ఈ సినిమాలో పవన్ సరసన నటించారు తాజాగా సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిలకమ్మా ముక్కుకి అనే పాట ఈ సినిమాలో ఉంది ఈ పాటకి కొరియోగ్రాఫర్ చేసింది అల్లు అర్జున్ అని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది. సినిమా షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ ఈ పాటకి అల్లు అర్జున్ అయితే ఎలా డాన్స్ చేస్తారు అని అడగగా… అల్లు అర్జున్ ఈ పాటకి డాన్స్ చేసి చూపించారట. పవన్ కళ్యాణ్ కూడా అలానే ఈ సినిమాలో చేశారని తెలుస్తోంది. చాలా సింపుల్ గా సినిమాలో ఈ పాటకి కొరియోగ్రఫీ చేసేసారట. ఇలా కొరియోగ్రాఫర్ గా బన్నీ మారిపోయారు కొంచెం డాన్స్ వేసి చూపిస్తే ఏకంగా కొరియోగ్రాఫర్ని చేసేసారు.