నదిలో పడిపోయిన బస్సు

నదిలో పడిపోయిన బస్సు

నేపాల్‌లో మంగళవారం బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌గంజ్‌ నుంచి గమ్‌గాధి వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పినాఝరి నదిలో ప్రమాదవశాత్తు పడింది.

ఛాయానాథ్‌ రారా మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ ఘటనలో 32 మంది చనిపోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు మై రిపబ్లికా అనే వెబ్‌సైట్‌ తెలిపింది. ప్రమాద బాధితులంతా విజయదశమి పండక్కి సొంతూళ్లకు వెళ్తున్న వారేనని పేర్కొంది.