క్యాబ్ గంజాయి ముఠా గుట్టు రట్టు

క్యాబ్ గంజాయి ముఠా గుట్టు రట్టు

గంజాయి స్మగ్లర్లు కొత్త అవతారమెత్తారు. క్యాబ్ డ్రైవర్లను గంజాయి తరలింపుకు ఉపయోగిస్తున్నారు. ప్రయాణికులను తరలించే వాహనాల్లో గంజాయి తరలిస్తున్న ఆరుగురు క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా విశాఖ ఏజెన్సీ ఏరియాలో తక్కువ ధరకు గంజాయి కొని తరలిస్తున్నారు.  ఏజెన్సీలో కిలో గంజాయిని రెండు వేల రూపాయలకు కొని హైదరాబాద్ లో పదివేలకు అమ్ముతున్నారు. క్యాబ్ డ్రైవర్లు విశాఖలో ప్రయాణికులను దించి తిరుగు ప్రయాణంలో గంజాయి తరలిస్తున్నారు. వారిని అరెస్టు పోలీసులు మూడు వందల యాభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.