సైబర్ క్రైమ్ పోలీసులు దర్శకుడు రాంగోపాల్ వర్మ పై కేసు

సైబర్ క్రైమ్ పోలీసులు దర్శకుడు రాంగోపాల్ వర్మ పై కేసు

ప్రముఖ సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో ఇటీవల తెరకెక్కిన చిత్రం అమ్మరాజ్యంలో కడప బిడ్డలు… కాగా ఎన్నో వివాదల నడుమన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా విడుదలైన అన్ని చోట్లలో విజయవంతంగా ప్రదర్షింపబడుతుంది. అయితే మొదటి నుండే ఈ చిత్రానికి ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. కాగా ఈ కమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రంపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ… ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కంప్లైంట్ ఇచ్చారు. కాగా ఈమేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్శకుడు రాంగోపాల్ వర్మ పై కేసు నమోదు చేసి, వర్మకు పోలీసులు నోటీసులు పంపించారు. ఈమేరకు నేడు కోర్టులో హాజరు కావాలని పోలీసులు తెలిపారు.

కాగా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకి సంబంధించి తన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి, అనవసరంగా తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పాల్ తెలిపారు. ఐతే ఈ సినిమాకి సంబధించిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రాంగోపాల్ వర్మ కు కేఏ పాల్ నవ్వుతూ ఇస్తున్నట్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి, విడుదల చెయ్యడం పై కేఏ పాల్ అభ్యంతరం చేస్తున్నారు. అయితే ఈ కేసులో వర్మ పోలీసుల ముందు ఇవాళ హాజరవుతారని స్పష్టత వచ్చినప్పటికీ కూడా రాంగోపాల్ వర్మ, కేఏ పాల్ పై పరువు నష్టం దావా వేస్తారని చెబుతున్నారు. ఈమేరకు వర్మ కోర్టుకి హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది.