తెలుగు సినిమాలకు నేనేప్పుడు దూరం కానంటున్నఅల్లు హీరొయిన్

తెలుగు సినిమాలకు నేనేప్పుడు దూరం కానంటున్నఅల్లు హీరొయిన్

‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్న కేథరిన్ ట్రెసా ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. పైసా.. రుద్రమదేవి.. సరైనోడు.. నేనే రాజు నేను మంత్రి.. జయ జానకి నాయక చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రల్లో చేసింది. ఎంత ప్రయత్నించినా కూడా ఈమెకు మెయిన్ లీడ్స్ దొరకడం లేదు. దాంతో మెల్లగా సైడ్ అయిపోయింది. తమిళ సినీ ఇండస్ట్రీలో ఈమె బిజీ అయ్యింది. అక్కడ వరుసగా చిత్రాల్లో నటిస్తోంది.

తాజాగా ఈమె తమిళంలో నటించిన అరువం చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా కేథరిన్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను షేర్ చేసుకుంది. ఈ సినిమా కథ నేపథ్యం నాకు బాగా నచ్చింది. కల్తీ ఆహారం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.. వాటికి కారణం ఏంటీ అనే విషయాలను అదృశ్య శక్తుల ఆధారంగా చూపించే ప్రయత్నం దర్శకుడు చేశాడు. ఇది హర్రర్ సినిమా అస్సలు కాదు. ఒక మంచి ఎంటర్ టైనర్ చిత్రంగా నేను చెప్తాను.

ఇక తెలుగులో సినిమాల విషయానికి వస్తే మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను. సరైనోడు చిత్రంలో మాదిరిగా కథలో భాగస్వామ్యం అయిన పాత్రలు చేయాలనుకుంటున్నాను. హీరోయిన్ గా తాను నటిస్తున్న సినిమాలు తనకు సంతృప్తి కలిగించేవిగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. తెలుగులో ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తున్నాను. తెలుగు సినిమాలకు నేనేం దూరం అవ్వాలనుకోవడం లేదు.. అవ్వలేదు అంది. మంచి పాత్రలతో సంప్రదిస్తే నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేథరిన్ పేర్కొంది. మళ్లీ తెలుగులో ఈ అమ్మడు బిజీ అయ్యేనా చూడాలి.