ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ఫోకస్..మోడీ ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఆదేశం

National Politics: NDA alliance wins 40 Lok Sabha seats in Bihar: PM Modi
National Politics: NDA alliance wins 40 Lok Sabha seats in Bihar: PM Modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్​లో నిర్వహించిన మాదిగల విశ్వరూప సభలో ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చే దిశగా తొలి అడుగు పడింది. ప్రధాని మోదీ ఎస్సీ రిజర్వేషన్లలో ఉప-వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను తాజాగా ఆదేశించారు. ఇందుకోసం వీలైనంత త్వరగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ఇతర సీనియర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రిజర్వేషన్‌ ఫలాలు మాదిగలకు అందడం లేదని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్‌) 3 దశాబ్దాలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే.

తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ ఎస్సీవర్గీకరణ డిమాండ్‌కు సంబంధించి త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. రిజర్వేషన్ల ఫలాలు తమకు అందటం లేదంటూ ఎమ్మార్పీఎస్ చేస్తున్న ప్రతి పోరాటంలో బీజేపీ వారికి అండగా నిలిచిందని మోదీ అన్నారు. వీలైనంత త్వరగా ఈ అన్యాయానికి ముగింపు పలికేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.