వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేందుకు ప్రయత్నాలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేందుకు ప్రయత్నాలు

వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన పాలనతో ప్రజల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్నారు.కానీ ఇప్పుడు జగన్ కన్న కలలు వైసీపీ అభిమానుల ఆశల మీద నీళ్లు జల్లేందుకు ఏదన్నా కుట్ర జరుగుతుందా అంటే దానికి సమాధానం కూడా వినిపిస్తుంది.ముఖ్యమంత్రి గా జగన్ ఐదేళ్ల పాలన ఆదిలోనే తుంచివేసే దిశగా వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక విస్తృత ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది.

అయితే ఇది ఇంకా ఫేస్ బుక్ మాధ్యమంలో వచ్చిందో లేదో కానీ ట్విట్టర్ అయితే ఇతర పార్టీల అభిమానులు ప్రచారం చేస్తూ కలకలం రేపుతున్నారు.ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని రాబోయే 2020వ సంవత్సరంలో మరోసారి జైల్లో పెట్టేందుకు కేంద్ర స్థాయిలో పెద్ద ఎత్తున వ్యూహాలు వేస్తున్నారని అది కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో కానీ ఆ తర్వాత కానీ అతన్ని మళ్ళీ జైలు పాలు చెయ్యబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు కలకలం రేపుతున్నాయి.ఇది కావాలనే వైసీపీ నేతల్లో గందరగోళం నెలకొల్పేందుకు ఎవరన్నా ఇలా వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారా లేక నిజంగానే ఏమన్నా కుట్ర జరుగుతుందా అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కావట్లేదు.మొత్తానికి మాత్రం ఈ వార్త ఇప్పుడు సంచలంగా మారింది.