ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్

ఈసారి జరిగినటువంటి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఘోరమైన వైఫల్యాన్ని చూడాల్సి వచ్చింది.దీనితో ఇక ఈ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది.ఇదిలా ఉండగా ఈ పార్టీను మరింత క్షీణింప జేసేందుకు అధికార పార్టీ వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడొక మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తుంది.అలాగే దానికి సంబంధించి ఇప్పుడు పార్టీ కీలక నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా దిశా నిర్దేశం చేసినట్టుగా వార్తలొస్తున్నాయి.

తాజాగా తెలుగు దేశం పార్టీ నుంచి ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయేందుకు మొగ్గు చూపుతున్నారని జగన్ దగ్గరకు సమాచారం రాగా వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నారని కానీ ఈ విషయంలో మాతరంమాత్రం చంద్రబాబుకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోపే మొదటి దెబ్బ తమదే పడిపోవాలని ఆలోపే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మన పార్టీలోకి వచ్చేయాలని జగన్ సూచించినట్టు సమాచారం.ఇదే కానీ జరిగితే ఇక ఏపీలో ప్రతిపక్షం అనేది కనుమరుగు అయ్యిపోయినట్టే అని చెప్పాలి.