ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న జనసేన పార్టీ

ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న జనసేన పార్టీ

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చిత్తూర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. అయితే నేడు చిత్తూరు జిల్లా మదనపల్లె జనసేన సమావేశంలో అనంతపురం జిల్లా నేత సాకే పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చానీయాంశమయ్యాయి. అనంతపురం జిల్లా నాయకులు, కార్యకర్తలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం మదనపల్లిలో సమావేశం కాగా ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో వైసీపీ శ్రేణుల అరాచకాలు పెరిగాయని ఆవేడన వ్యక్తం చేశారు.

అయితే ఈ మాట్లాడిన జనసేన కార్యకర్త సాకే పవన్ వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదని తమ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే అంటే వైసీపీ నేతల తలలు నరుకుతానని అన్నారు. అయితే దీనిపై జనసేన నేత సాకె పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై మదనపల్లె పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.