పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు

పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు

గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే. ఎక్కడైతే దిశను దారుణంగా కాల్చేశారో, అక్కడికి సరిగ్గా 300 మీటర్ల దూరంలో నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలు చెల్లాచెదరుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరి డెడ్ బాడీలు పొలాల మధ్య 30 మీటర్ల విస్తీర్ణంలో పడివున్నాయి.

ఈ ప్రాంతంలో చుట్టూ చెట్లు, పొదలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మృతదేహాలను పరిశీలిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు. చటాన్ పల్లి జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జ్ కింద సీన్ రీకన్ స్ట్రక్షన్ సమయంలో వీరంతా పారిపోయేందుకు ప్రయత్నించి…పోలీసులు ఆయుధాలు లాక్కోవడంతో పాటు రాళ్లను విసురుతూ పొలాల మీదుగా పరిగెత్తేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపి వారిని హతమార్చారు.