పుట్టపర్తి గంగన్నకు బాబు షాక్ ఇస్తారా..?

chandra-babu--shock-for-put

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Chandra Babu  Shock For Puttaparthi Municipal Chairman Ganganna

పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ గంగన్న వ్యవహారం ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు పదవి నుంచి తప్పుకోమని చెప్పాక కూడా గంగన్న కొనసాగుతానని ప్రకటించడం కలకలం రేపుతోంది. అసలు గంగన్న ఎవరి అండ చూసుకుని ఇంత రెచ్చిపోతున్నారో.. క్యాడర్ కు అర్థం కావడం లేదు. పుట్టపర్తి నియోజకవర్గంలో మిగతా పదవులకు ఒకలా, మున్సిపల్ ఛైర్మన్ గిరీకి మరోలా రూల్సేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

పైగా తనకు రెండున్నరేళ్లే పదవీ కాలమని ఎవరూ చెప్పలేదంటున్నారు గంగన్న. కానీ ఆ విషయంలో వాస్తవం లేదంటున్నాయి టీడీపీ వర్గాలు. చాలా మంది జడ్పీ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపిక సమయంలో పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి.. ఈ రెండున్నరేళ్ల ఫార్ములాను అమలు చేశారు. అలాంటిది తనకు మాత్రం చెప్పలేదంటున్నారంటే.. గంగన్నకు దిగే ఉద్దేశం లేదనే అర్థమౌతోంది.

కానీ ఇంతకంటే ముదురు నేతల్నే చంద్రబాబు డీల్ చేశారని, గంగన్న పెద్ద లెక్కకాదని అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ విషయంలో ఏం జరిగిందో గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు గంగన్నను కూడా పిలిపించి చీవాట్లు పెట్టడం ఖాయమని, అసలు చెప్పిన పని చేయకుండా కలవాలని కోరితే.. బాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని గుర్తుచేస్తున్నాయి టీడీపీ వర్గాలు.

మరిన్ని వార్తలు

ఐవైఆర్ కృష్ణారావు వివరణ ఇదే…

బాబుని ఐవైఆర్ బెదిరిస్తున్నాడా?