తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్న బీజేపీ

modi doesn't give priority to chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Modi And Amit Shah Not Giving Priority To Chandrababu

మిత్రపక్షాలపై పెత్తనం చేయడం మోడీకి అమిత్ షా తో పెట్టిన విద్య. ఇద్దరూ జోడు గుర్రాలు స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తున్నా… ఇద్దరిదీ క్రిమినల్ మైండేనని మిత్రపక్షాలు లోలోపల వణికిపోతున్నాయి. గతంలో కాంగ్రెస్ ది భస్మాసుర హస్తంగా పేరుందని, కానీ ఇప్పుడు బీజేపీ అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా తయారైందని చెబుతున్నారు. ఏకంగా నమ్మకమైన మిత్రుడు చంద్రబాబుకే షాకిచ్చేలా నెల్లూరులో బీజేపీ సర్వే చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు ఎవర్నైనా నమ్మితే బాగా నమ్ముతారు. అందుకే రాజకీయాల్లో బాబుకు విశ్వసనీయ భాగస్వామిగా పేరుంది. కానీ మోడీ మాత్రం అందర్నీ అపనమ్మకంతోనే చూస్తారు. చంద్రబాబుకు ఆయన ఏనాడూ సరైన విలువ ఇవ్వలేదన్నది వాస్తవం. అయితే ఏపీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బాబు సర్దుకుపోతున్నారు. తన కంటే ముందు సీఎం అయిన వ్యక్తిపై అథార్టీ చేయడం మోడీ లాంటి నడమంత్రపు పదవులు వచ్చినవారికే చెల్లిందని టీడీపీ నేతలు బాహాటంగానే విమర్శిస్తుంటారు.

అసలు మోడీ అనే మాట ఎన్నాళ్లు ఓట్లు కురిపిస్తుందో ఎవరికీ తెలీదు. అలాంటి మోడీ మిత్రపక్షాల పాలనపై సర్వే చేయడం అందరికీ ఆగ్రహం కలిగిస్తోంది. ముందు కేంద్ర ప్రభుత్వ పాలనపై సర్వే చేసుకుని, తర్వాత తమ జోలికి రావాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. మోడీ ఇలాంటి పనులు చేస్తే బాబులాగా అందరూ హుందాగా ఉండరని బీజేపీకి త్వరలోనే తెలిసొస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకోవాలని కూడా చంద్రబాబుకు మహానాడులో భారీగా వినతులు అందాయట.

మరిన్ని వార్తలు:

బాబుని ఐవైఆర్ బెదిరిస్తున్నాడా?

ఐవైఆర్ కృష్ణారావు వివరణ ఇదే…