రామ్ నాథ్ కోవింద్ కు ప్రజా బలం లేదా..?

Public Do Not Support Ram Nath Kovind

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Public  Do Not Support  Ram Nath Kovind

రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేయాలన్న ఎన్డీఏ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. దళిత రాష్ట్రపతి పేరుతో విపక్షాల ముందరికాళ్లకు మోడీ బంధాలు వేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. అసలు రామ్ నాథ్ ప్రజా బలమేంటి … అనే విషయం చూస్తే ఆశ్చర్యపోయే విషయాలు వెలుగుచూశాయి. రామ్ నాథ్ ఇంతవరకూ ఒక్కసారి కూడా ప్రజాక్షేత్రంలో బలం నిరూపించుకోలేకపోయారు.

పన్నెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా చేసిన కోవింద్… అంతకు ముందు ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ రెండుసార్లు ఆయన్ను ఓటమే వెక్కిరించింది. అంటే ప్రజాబలం లేని వ్యక్తిని కూడా పార్టీ ఆశీస్సులుంటే రాష్ట్రపతి చేయొచ్చని ఈ ఉదంతం నిరూపించింది. రాష్ట్రపతి అయ్యే వ్యక్తికి ప్రజాబలం ఉండాలన్న రూలేమీ లేదు కానీ… పార్టీకి మరీ విధేయుడిగా ఉండే వ్యక్తి అయినా కూడా ప్రమాదమే అనే మాట వినిపిస్తోంది.

రామ్ నాథ్ కు పార్టీ ఏ పని అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తున్నారట. మోడీ అంటే పొసగని నితీష్ కుమార్ ఈ మధ్య కాలంలో తన వైఖరి మార్చుకోవడానికి కూడా కోవింద్ కారణమంటున్నాయి బీజేపీ వర్గాలు. నితీష్ తో గొడవలు పెట్టుకోకుండా సామరస్యంగా ఉంటూనే… చెప్పాల్సిన రీతిలో చెప్పడం ద్వారా మోడీపై వ్యతిరేకత మెల్గగా పోగొట్టారన్న వాదన ఉంది. ఆ చాకచక్యమే కోవింద్ కు రాష్ట్రపతి పదవి కట్టబెట్టిందంటున్నారు.

మరిన్ని వార్తాలు:

పుట్టపర్తి గంగన్నకు బాబు షాక్ ఇస్తారా..?

కేసీఆర్ ఐఏఎస్ లను అవమానించారా..?