బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ పై లేటెస్ట్ రూమర్.!

బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ పై లేటెస్ట్ రూమర్.!
Cinema News

టాలీవుడ్ యంగ్ అండ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “ఛత్రపతి”. ఈ చిత్రంతో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన తాను ఆ సినిమాతో అయితే హిందీలో అంత మంచి వెల్కమ్ ని అందుకోలేదు. అయితే ఈ సినిమా అనంతరం తాను తెలుగులో సినిమా చేయాల్సి ఉంది. దీనిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం “భీమ్లా నాయక్” దర్శకుడు సాగర్ కె చంద్రతో చేయనున్న సంగతి తెలిసిందే.

బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ పై లేటెస్ట్ రూమర్.!
BellamKonda Srinivas

అయితే ఈ చిత్రం ఎప్పుడో అనౌన్స్ అయినప్పటికీ ఇంకా ఈ సినిమాపై ఎలాంటి ప్రోగ్రెస్ కనపడలేదు. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ రూమర్స్ కొన్ని వినిపిస్తున్నాయి. దీనితో అయితే ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది అని తెలుస్తుంది. అసలు కారణాలు ఏంటి అనేవి ఇంకా క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికి అయితే ఈ సినిమా ఆల్ మోస్ట్ ఆగిపోయిన్నట్టే తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.