ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “చంద్రముఖి 2”

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “చంద్రముఖి 2”
Cinema News

కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ హీరోయిన్ గా దర్శకుడు పి వాసు తెరకెక్కించిన హారర్ కామెడీ సినిమా “చంద్రముఖి 2”. మరి తమిళ్ సహా తెలుగులో కూడా భారీ హిట్ అయ్యిన ఈ సినిమా దానికి సీక్వెల్ గా పార్ట్ 2 రాగా ఇది మాత్రం ఊహించని విధంగా పరాజయం పాలయ్యింది. దీనితో పెద్దగా వసూళ్లు అందుకోని ఈ సినిమా ఇపుడు ఓటిటి ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “చంద్రముఖి 2”
Cinema news

మరి ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు భారీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో ఈ సినిమా అయితే ఇప్పుడు పాన్ ఇండియా భాషల్లో అయితే రిలీజ్ కి వచ్చేసింది. మరి అప్పుడు చూడని వారు చంద్రముఖి సీక్వెల్ ని ఎలా ఉన్నా పర్వాలేదు చూడాలి అనుకునేవారు ఇప్పుడు ఒకసారి ట్రై చేయవచ్చు. ఇక ఈ సినిమా లి కీరవాణి సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.