తారక్ డూప్ తో “వార్ 2” స్టార్ట్..క్లారిటీ ఇదే.!

తారక్ డూప్ తో “వార్ 2” స్టార్ట్..క్లారిటీ ఇదే.!
Cinema News

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఉన్న పలు సెన్సేషనల్ మల్టీస్టారర్ సినిమా ల్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మరియు మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సినిమా “వార్ 2” కూడా ఒకటి. మరి ఈ మూవీ పై అనేక అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూట్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వైరల్ గా మారింది.

ప్రస్తుతం మూవీ షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అని అలాగే హృతిక్ కూడా పాల్గొన్నాడు కానీ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి కొన్ని సీన్స్ డూప్ తో కంప్లీట్ చేసారని బాలీవుడ్ వర్గాలు కొన్ని వార్తలు ప్రచారం చేస్తున్నాయి. అయితే షూట్ మొదలు అనేది నిజమే కానీ ఎన్టీఆర్ పాత్రకి డూప్ తో చేసేసారు అనేది నిజం కాదు అని తెలుస్తుంది .

తారక్ డూప్ తో “వార్ 2” స్టార్ట్..క్లారిటీ ఇదే.!
Junior NTR, Hrithik Roshan

ప్రస్తుతం చేసింది కేవలం రెండు రోజులు షూట్ మాత్రమే అని అది కూడా జస్ట్ టెస్ట్ పర్పస్ షూట్ అని ఫుల్ ఫ్లెడ్జ్ షూట్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదని ప్రస్తుతానికి ఉన్న సమాచారం. సో ప్రస్తుతం వార్ 2 పై ప్రచారం అవుతున్న ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకోవాలి . ఇక ఈ భారీ సినిమా ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిల్మ్స్ వారు తమ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్నారు.