WORLD CUP 2023:ఇంగ్లాండ్ పై శ్రీలంక ఘన విజయం..మరి సెమీస్ కు చేరుకుంటుందా…?

WORLD CUP 2023: Sri Lanka's great victory over England...will they reach the semis...?
WORLD CUP 2023: Sri Lanka's great victory over England...will they reach the semis...?

ఈసారి ప్రపంచ కప్ లో అసలైన వినోదం అందుతోంది అని చెప్పాలి. డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకు ఆడిన అయిదు మ్యాచ్ లలో నాలుగు ఓటములతో సెమీస్ కు చేరడానికి అవకాశం లేకుండా పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కేవలం 156 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి అప్రతిష్టను మూటగట్టుకుంది. అనంతరం శ్రీలంక మరో 25 ఓవర్లు మిగిలి ఉండగానే 2 వికెట్లు కోల్పోయి ఛేదించి సెమీస్ కు ఇంకా ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఛేదనలో ఓపెనర్ నిస్సంక (77) మరియు సమరవిక్రమ (65) అర్ద సెంచరీ లతో రాణించి శ్రీలంకకు గెలుపును సాధించి పెట్టారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ లలో నాలుగు ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానానికి పడిపోయింది.ఇక శ్రీలంక ఆడిన అయిదు మ్యాచ్ లలో రెండు విజయాలు సాధించి అయిదవ స్థానానికి చేరుకుంది. మరి శ్రీలంక సెమీస్ కు ఇదే ఊపుతో చేరుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని మ్యాచ్ లు చూడాల్సిందే.