WORLD CUP 2023:డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఇక ఇంటికేనా? ఏమైనా ఛాన్సుందా ?

WORLD CUP 2023: Is defending champion England home now? Any chance?
WORLD CUP 2023: Is defending champion England home now? Any chance?

శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయి ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్ జట్టు ఈ ఓటమితో దాదాపుగా ప్రపంచ కప్ సెమీస్ కు చేరే ఆశలు లేనట్లే. కానీ ఎక్కడో ఒక దగ్గర చిన్న ఆశ ఉంది.. క్రికెట్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేని పరిస్థితి. పాయింట్ల పట్టిక ప్రకారం ప్రస్తుతం ఇంగ్లాండ్ తొమ్మిదవ స్థానంలో కేవలం రెండే పాయింట్లు సాధించి నెట్ రన్ రేట్ కూడా దారుణంగా ఉంది. అయితే ఇక మిగిలిన నాలుగు మ్యాచ్ లలో తప్పక భారీ తేడాతో గెలవడంతో పాటుగా మిగిలిన జట్ల గెలుపు ఓటముల పైన ఆదారపడాల్సి ఉంది.

అలా జరిగినా ఇంగ్లాండ్ పూర్తి మ్యాచ్ లు అయ్యే లోపు అయిదు మ్యాచ్ లు గెలిచి 10 పాయింట్ లు గెలుస్తుంది.. అప్పుడు సెమీస్ కు చేరుతాయని భావిస్తున్న ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లలో ఎవరైనా పాయింట్ల దగ్గర ఆగిపోవడమే కాకుండా నెట్ రన్ రేట్ ఇంగ్లాండ్ కన్నా తక్కువ ఉండాలి.ఇంగ్లాండ్ తన తర్వాత మ్యాచ్ లలో ఇండియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్ మరియు పాకిస్తాన్ లతో ఆడుతుంది. మరి చూద్దాం వీరి అదృష్టం ఎలా ఉందొ ?