“చంద్రయాన్ – 3” రీ యాక్టీవేట్ కు సిద్ధం !

"Chandrayaan-3" ready to reactivate!

ఇస్రో గత నెలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నింగిలోకి చంద్రయాన్ 3 మిషన్ ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. కాగా ఇది ప్రయాణించి ఆగష్టు 23వ తేదీన ల్యాండర్ మరియు రోవర్ లు చంద్రుడి యొక్క ఉపరితలంపై దక్షిణ ధ్రువంలో దిగి ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఈ ల్యాండర్ మరియు రోవర్ లను రీ యాక్టీవేట్ చేయడానికి ఇస్రో సన్నద్ధం అవుతోంది. ముఖ్యంగా రోవర్ అయితే చంద్రుడి ఉపరితలంపై 200 మీటర్లు దూరం ప్రయాణించి అక్కడ ఉన్న సమాచారం మొత్తాన్ని ఇస్రో కు అందించింది. ఆ తర్వాత తిరగడానికి వీలు లేకుండా చీకటి పడడంతో ల్యాండర్ మరియు రోవర్ లను స్లీప్ మోడ్ లో ఉంచడం జరిగింది.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇవి రెండు ఉన్న ప్రాంతంలో సూర్య కిరణాలూ ప్రసరించే సమయం రావడంతో మళ్ళీ వీటిని యాక్టీవేట్ చేయనున్నారు.నిన్న మరియు ఈ రోజు పడనున్న సూర్య రశ్మి కిరణాలను అనుసరించి ల్యాండర్ మరియు రోవర్ లలో ఉన్న బ్యాటరీలు రీఛార్జి అయ్యి యాక్టీవేట్ అవుతాయట. ఈ విధంగా కనుక జరిగితే ఇది అంతరిక్ష చరిత్రలోనే అద్భుతం అవుతుందని ఇస్రో తెలియచేస్తోంది.