చినబాబు మూవీ రిలీజ్ డేట్… జులై 13

Chinna Babu movie Release Date

నటీ నటులు : కార్తీ, సయేషా, ప్రియ భవానీ శంకర్, సత్యరాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను తదితరులు
కెమెరా : వేల్ రాజ్
సంగీతం : డి.ఇమ్మాన్
సహ నిర్మాతలు : సి.హెచ్.సాయికుమార్ రెడ్డి-రాజశేఖర్ కర్పూర సుందర పాండ్యన్
నిర్మాతలు : సూర్య-మిర్యాల రవీందర్ రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : పాండిరాజ్.

తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న తమిళ హీరోల్లో కార్తి ఒకరు. సూర్య సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా తమిళంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కడియకుట్టి సింగం’. 2డి ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మాతగా తెరకెక్కించారు. ఈ సినిమాకి పాండిరాజత్ దర్శకత్వం వహించారు. సయేష హీరోయిన్. సత్యరాజ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ‘చినబాబు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు ‘చినబాబు’ను అందిస్తున్నారు.

దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమాలో రైతుల సమస్యలను ముఖ్యంగా ప్రస్తావించారు. అలాగే కార్తి తొలిసారి పూర్తిస్థాయి రైతు పాత్రలో కనిపించబోతున్నారు. రైతుల సమస్యలను చర్చిస్తూనే.. కామెడీ, యాక్షన్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను జులై 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ఖరారు చేశారు. ‘రంగస్థలం’ సినిమాలో కాశీ పాత్రలో నటించిన తెలుగు నటుడు శత్రు ‘చినబాబు’లో ప్రధాన విలన్‌గా కనిపించనున్నాడు. డి.ఇమాన్ సంగీతం, వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ఇతక ఆకర్షణలు. ఇదిలా ఉంటే, మెగా చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతున్న ‘విజేత’ సినిమా జులై 12న విడుదలవుతోంది. వాస్తవానికి ఈ సినిమా జులై 6నే విడుదల కావాల్సి ఉంది. మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు పోటీ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ‘విజేత’ విడుదల తేదీని మార్చారు. అయితే ఇప్పుడు ‘విజేత’కు ‘చినబాబు’ అలాగే వర్మ శిష్యుడు తెరకెక్కించిన RX 100 చిత్రాల నుంచి పోటీ ఎదురయ్యే అవకాశముంది.