బిగ్‌బాస్‌ విన్నర్‌ను ప్రకటించేది ఆ స్టార్‌ హీరో..!

tollywood-stars-announced-the-bigg-boss-season-1-winner

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా రియాల్టీ గేమ్‌ షో ‘బిగ్‌బాస్‌’ తెలుగు ఫైనల్‌ ఎపిసోడ్‌కు వేళ అయ్యింది. గత 70 రోజులుగా నిర్విరామంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్న ‘బిగ్‌బాస్‌’ గేమ్‌ షో ఫైనల్‌లో ఎవరు గెలిచారు అనే విషయంపై తెలుగు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి 16 మంది పార్టిసిపెంట్స్‌ వెళ్లడం జరిగింది. 10 మంది ఎలిమినేషన్‌ ద్వారా బయటకు రాగా సంపూర్నేష్‌బాబు మాత్రం ఇంట్లో ఉండటం తన వల్ల కాదు అంటూ బయటకు వెళ్లి పోయాడు. ఇక ప్రస్తుతం ఇంట్లో అయిదుగురు సభ్యులు హరితేజ, శివబాలాజీ, ఆదర్ష్‌, అర్చన, నవదీప్‌లు ఉన్నారు.

ఈ అయిదుగురిలో విజేత ఎవరు అనే విషయంపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. భారీగా బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నాయి. ఎక్కువ శాతం హరితేజ విజేత అంటుండగా, కొందరు శివబాలాజీ అని, కొందరు ఆదర్ష్‌ అంటూ అంచనాలు వేస్తున్నారు. ఇక బిగ్‌బాస్‌ ఫైనల్‌ను రేపు అంటే ఆదివారం సాయంత్రం నుండి ప్రసారం చేయబోతున్నట్లుగా స్టార్‌ మాటీవీ ప్రకటించింది. సాయంత్రం ఆరు గంటల నుండి ఫైనల్‌ విజేత ప్రకటించే కార్యక్రమం జరుగుతుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 1 విన్నర్‌ను ప్రకటించేందుకు మెగాస్టార్‌ చిరంజీవి లేదా కింగ్‌ నాగార్జునల్లో ఒక్కరు లేదా వీరిద్దరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరు కూడా మాటీవీలో భాగస్వామ్యులు. అందుకే వీరిద్దరిని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.