శరవేగంగా జరుపుకుంటున్న చిరంజీవి షూటింగ్

శరవేగంగా జరుపుకుంటున్న చిరంజీవి షూటింగ్

ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇంకా టైటిల్ కూడా ఖరారు కానీ ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే భారీ అంచలనాలను నెలకొల్పుకున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ చిత్రం పై ఏ చిన్న అప్డేట్ గాని బజ్ న్యూస్ కానీ బయటకు వచ్చినా సరే అది మంచి హాట్ టాపిక్ అయ్యిపోతుంది.

అలా ఇప్పుడు మరో వార్త హాట్ టాపిక్ గా నిలిచింది.మెగాస్టార్ నటిస్తున్న ఈ చిత్రంలో ఒక మెగా సెట్టింగ్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.కేవలం ఈ ఒక్క సెట్టింగు కోసమే ఓ మీడియం హీరో సినిమాకు పెట్టె బడ్జెట్ కంటే ఎక్కువే పెడుతున్నారట.అలా దాదాపు 20 కోట్లతో ఏకంగా ఒక కాలనీ లాంటి సెట్టింగును నిర్మిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.కేవలం ఓ సెట్టింగుకే 20 కోట్లు అంటే ఆ విజువల్స్ కు చిత్రంలో ఎంత ప్రాధాన్యత ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.మరి కొరటాల మెగాస్టార్ ను ఎలా చూపించబోతున్నారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.