జులై 31 న విడుదల అవుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం

జులై 31 న విడుదల అవుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం జులై 31 న విడుదల అవుతుంది అని చిత్ర బృందం షూటింగ్ ప్రారంభానికి ముందే తెలిపింది. అయితే ప్రస్తుతం ఇంకా పూర్తీ స్థాయిలో షూటింగ్ పనులు పూర్తీ కాకపోవడం, ఇంకా తదితర అంశాలలో జాప్యం ఉండటంతో మిగతా మహేష్, చిరు, ప్రభాస్, అల్లు అర్జున్ లకు తలనొప్పిగా మారినట్లు వుంది. అయితే మహేష్, బన్నీ లకు ఈ ఏడాది సంక్రాంతి బాగా కలిసొచ్చింది. అయితే వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ లు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్, చిరు చిత్రాలు కూడా దసరా, సంక్రాంతి లకు విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

అయితే ముందుగానే డేట్ ని ఫిక్స్ చేసుకున్న ఈ హీరోలు వారి సినిమా రిలీజ్ అయ్యేనాటికి ఆర్ఆర్ఆర్ వస్తుందేమో అని ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాజమౌళి తీరు ప్రస్తుతం పెద్ద హీరోలకు కాస్త తలనొప్పిగా మారిందనే చెప్పాలి. గతం లో బాహుబలి చిత్రానికి మహేష్ శ్రీమంతుడు కొంత గ్యాప్ తీసుకుంది. బాహుబలి సిరీస్ చిత్రాల సమయం లో ఎలాంటి చిత్రం విడుదల కాలేదు. అంటే రాజమౌళి చిత్రానికి అంతలా మార్కెట్ ఉందని చెప్పాలి. మరి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్ర విడుదల తేదీ ఫై ఎపుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.