చిరుకు పెద్ద చెడ్డ పేరు

Chiru Host Meelo Evaru Koteeswarudu Show Utter Flap

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Chiru Host Meelo Evaru Koteeswarudu Show Utter Flap

మెగాస్టార్‌ చిరంజీవి స్టార్‌ మాటీవీలో ప్రసారం అయిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంకు హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఆ షో చిరంజీవి వల్ల భారీ టీఆర్పీ రేటింగ్‌ సాధించడం ఖాయం అని అంతా భావించారు. కాని చిరంజీవికి ఇచ్చిన పారితోషికం కూడా లాభం రాలేదు అని, ఆ షోతో భారీగా నష్టాలే మిగిలినట్లుగా స్టార్‌ మా ప్రతినిథి ఒకరు చెబుతున్నారు. ఛానెల్‌కు వచ్చిన లాస్‌ను కవర్‌ చేసుకోవడంతో పాటు, కొత్తగా మేనేజ్‌మెంట్‌ మారవడం వల్ల ఛానెల్‌ నుండి 80 మంది ఎంప్లాయిస్‌ను తొలగించడం జరిగింది.

మాటీవీ ఆరంభం నుండి పని చేస్తున్న వారిని కాకుండా మద్యలో జాయిన్‌ అయిన వారిని, అనవసరం అనుకున్న వారిని స్టార్‌ యాజమాన్యం తొలగించే నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి అడుగులు ముందుకు వేస్తుంది. ఆ 80 మంది ఉద్యోగాలు పోవడంకు ప్రధాన కారణం చిరంజీవి అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చిరంజీవి షోకు వారికి సంబంధం లేదని, అనవసరంగా ఉన్న వారిని స్టార్‌ కట్టింగ్‌ పేరుతో తొలగించినట్లుగా మాటీవీ అధికారిక ప్రతినిధి చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో మాత్రం చిరంజీవి వల్లే 80 మంది ఉద్యోగాలు గల్లంతు అయ్యాయి అంటూ యాంటీ మెగా ఫ్యాన్స్‌ ప్రచారం చేస్తున్నారు. చిరంజీవికి ఇదో పెద్ద చెడ్డ పేరుగా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. మరో సీజన్‌ను చిరంజీవి చేస్తాడా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికర విషయం.

మరిన్ని వార్తలు:

శ్రీకాంత్‌ అడ్డాల ఏం చేస్తున్నాడో తెలుసా?

ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ మూడో టీజర్‌