శ్రీకాంత్‌ అడ్డాల ఏం చేస్తున్నాడో తెలుసా?

Director Srikanth Addala is preparing a good love story

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Director Srikanth Addala is preparing a good love story

‘కొత్తబంగారు లోకం’ చిత్రంతో అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్‌ అడ్డాల ఆ తర్వాత మెగా హీరో ‘ముకుంద’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా సక్సెస్‌ కాక పోయినా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మహేష్‌బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి మంచి ఫ్యామిలీ మల్టీస్టారర్‌ చిత్రం చేయడంతో శ్రీకాంత్‌ అడ్డాల స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఆ సినిమా తర్వాత మహేష్‌ మరో అవకాశంగా ‘బ్రహ్మోత్సవం’ను ఇచ్చాడు. అయితే బ్రహ్మోత్సవం సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మహేష్‌బాబు కెరీర్‌లోనే బాబోయ్‌ అనుకునే చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించాడు. ఆ సినిమాతో శ్రీకాంత్‌ అడ్డాల అంటేనే హీరోలు భయపడే స్థాయికి వెళ్లి పోయాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా తెర వెనుక ఉండిపోయిన శ్రీకాంత్‌ అడ్డాల మళ్లీ ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. దిల్‌రాజుకు చెప్పిన కథ నచ్చడంతో మీడియం బడ్జెట్‌తో సినిమాను నిర్మించేందుకు ఓకే చెప్పాడు. ‘కొత్తబంగారు లోకం’ తరహాలోనే ఒక మంచి ప్రేమ కథను శ్రీకాంత్‌ అడ్డాల సిద్దం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొత్త వారితో లేదా యువ హీరోతో ఆ సినిమాను చేసే అవకాశాలున్నాయి. పది కోట్ల లోపు బడ్జెట్‌తోనే శ్రీకాంత్‌ అడ్డాల సినిమాను పూర్తి చేయాల్సిందిగా దిల్‌రాజు కండీషన్‌ పెట్టినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

తనయుడి కోసం భారీ ప్లాన్‌

ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ మూడో టీజర్‌