తనయుడి కోసం భారీ ప్లాన్‌

puri Jagannath director high budget movie with is son Akash

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Puri Jagannath Director High Budget Movie With Is Son Akash

తెలుగులో టాప్‌ డైరెక్టర్స్‌ జాబితాలో పూరి జగన్నాధ్‌ పేరు ముందు వరుసలో ఉంటుంది. అటువంటి దర్శకుడు ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ‘పైసా వసూల్‌’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఆ సినిమాను సెప్టెంబర్‌లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత పూరి జగన్నాధ్‌ ఒక భారీ సినిమాను చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ సినిమాతో తన కొడుకు ఆకాష్‌ పూరిని హీరోగా గ్రాండ్‌గా లాంచ్‌ చేయబోతున్నాడు. 

ఇప్పటి వరకు పలువురు హీరోలను తెరంగేట్రం చేయించిన దర్శకుడు పూరి తన కొడుకు కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్‌తో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఒక ప్రముఖ నిర్మాత పూరి తనయుడిని పరిచయం చేసేందుకు ముందుకు వచ్చాడు. పూరితో పాటు ఆకాష్‌ కూడా పారితోషికం లేకుండానే ఆ సినిమాను చేయనున్నారు. 50 కోట్ల బడ్జెట్‌తో ఇప్పటి వరకు తెలుగులో ఏ హీరో ఇవ్వనంత గ్రాండ్‌గా ఆకాష్‌ పూరి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

తనయుడిని స్టార్‌ హీరోగా నిలిపేందుకు పూరి విశ్వ ప్రయత్నాలు చేయబోతున్నాడు. సెప్టెంబర్‌లో ‘పైసా వసూల్‌’ చిత్రం విడుదలవ్వడమే ఆలస్యం వెంటనే తనయుడి కోసం కథను సిద్దం చేయబోతున్నాడు. నటనతో పాటు ప్రత్యేకమైన యాక్షన్‌ విభాగంలో కూడా రెండు సంవత్సరాలుగా ఆకాష్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు. అమెరికా, థాయిలాండ్‌, బ్యాంకాక్‌ వంటి ప్రదేశాల్లో అకాష్‌ ట్రైనింగ్‌ అవుతున్నాడు. చిరుతతో రామ్‌ చరణ్‌ను పరిచయం చేసిన పూరి అదే స్థాయిలో తనయుడిని పరిచయం చేసి ఒక స్టార్‌గా ఆకాష్‌ను నిలపాలని పూరి తాపత్రయ పడుతున్నాడు. 2018 చివర్లో పూరి తనయుడి సినిమా వచ్చే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు