‘జయదేవ్‌’పై మండిపడుతున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌

Prabhas Fans Feel Irritating With Jayadev Telugu Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Prabhas Fans Feel Irritating With Jayadev Telugu Movie

పీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ నటించిన ‘జయదేవ్‌’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. ప్రముఖ దర్శకుడు జయంత్‌ సి పరాన్జీ ఈ సినిమాను తెరకెక్కించాడు. పెద్దగా అంచనాలు ఏమీ లేకుండానే విడుదల అయిన ఈ సినిమాపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని ‘బాహుబలి 2’ చిత్రాన్ని తొలగించి ఈ చిత్రాన్ని వేయడం జరిగింది. ‘బాహుబలి 2’ మెయిర్‌ థియేటర్‌గా ఆ థియేటర్‌ ఉంది. ఇప్పటికి కూడా మంచి కలెక్షన్స్‌ను రాబడుతుంది. అయితే సెంటిమెంట్‌గా ఈ థియేటర్‌ అయితే బాగుంటుందని చిత్ర నిర్మాత బాహుబలిని తొలగించి మరీ జయదేవ్‌ను వేయడం జరిగింది.

ఒక అనామక చిత్రం కోసం ఇంకా మంచి కలెక్షన్స్‌ను రాబడుతున్న సినిమాను ఆ థియేటర్‌ నుండి తొలగించడంపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ థియేటర్‌లో ‘బాహుబలి 2’ ఖచ్చితంగా 100 రోజులు ఆడుతుందని అంతా భావించారు. కాని జయదేవ్‌ నిర్మాతలు తమకున్న పలుకుబడిని ఉపయోగించి బాహుబలిని తొలగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో జయదేవ్‌ చిత్రాన్ని బహిష్కరించాలంటే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మరియు రాజమౌళి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పిలుపునిచ్చారు. వారం రోజుల తర్వాత మళ్లీ బాహుబలి చిత్రాన్ని వేస్తామని థియేటర్‌ యాజమాన్యం చెబుతున్నా కూడా ఫ్యాన్స్‌ మాత్రం ఆగ్రహంతోనే ఉన్నారు.

మరిన్ని వార్తలు:

ఈ ఫ్రైడే డ్రై డే.. డీజే కుమ్ముడే

‘జయదేవ్‌’పై మండిపడుతున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌