రోజాకు పవనే రావాలట

roja targeting janasena chief pawan kalyan with political comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Roja Targeting Janasena Chief Pawan Kalyan With Political Comments

మొన్నటిదాకా ఏపీ సీఎం టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించిన రోజా.. ఇప్పుడు జనసేనాధిపతిపై దృష్టి పెట్టారు. పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని, ఎన్నికల హామీల్ని తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. ఇంతమంది కాకలు తీరిన నేతలుంటే.. పవన్ ను పనిగట్టుకుని పంచాయితీలోకి ఎందుకు లాగుతున్నారో ఎవరికీ ఆర్థం కావడం లేదు. రోజా ఇకపై ఇలాంటి పిచ్చి కామెంట్లు చేయొద్దని పవర్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

విషయమేమిటంటే పవన్ లబ్బర్ సింగో, గబ్బర్ సింగో తేల్చుకోవాలని తూ.గో వైసీపీ ప్లీనరీలో రోజా సవాల్ విసరడం కలకలం రేపుతోంది. పొలిటికల్ నిద్రలో ఉన్న పవన్ ను లేపడం రోజా తరం కాదని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. కానీ రోజా మాత్రం పట్టువీడని విక్రమార్కురాలిలాగా పోరాడుతూనే ఉంది. అదేమంటే పవన్ చెప్పిన మాటలే అడుగుతున్నామని, కొత్తడిమాండ్లు చేయడం లేదని సమర్థించుకుంటున్నారు.

ఏపీలో కాపుల్ని బీసీల్లో చేర్చడంలో జాప్యం జరుగుతున్నా పవన్ నిలదీయలేదని, చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జనసేన అధినేత.. జీఎస్టీతో చేనేతకు సంక్షోభం తప్పదనితెలిసినా నోరెత్తడం లేదని రోజా అంటున్నారు. అన్నీ తెలిసిన రోజా, ఆమె పార్టీ అధినేత జగన్ జీఎస్టీకి ఎందుకు మద్దతిచ్చారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఓ ఎమ్మెల్యే, ఓ పార్టీ అధ్యక్షుడు తీసుకురాలేని ఒత్తిడి.. పార్ట్ టైమ్ పొలిటీషియన్ పవన్ ఎలా తీసుకురాగలరని రోజా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు