స్టార్లు కావాలంటున్న గద్దర్

Gaddar Wants Pawan And Rajinikanth For South India Self Respect

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Gaddar Wants Pawan And Rajinikanth For South India Self Respect

ప్రజాయుద్ధనౌకగా పేరున్న గద్దర్ కు సొంతంగా ప్రజాబలం పెంచుకోవాలని లేదు కానీ.. స్టార్లను ఆకర్షించాలని అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో పొలిటికల్ స్టేట్ మెంట్లు చాలానే ఇస్తున్న గద్దర్.. వచ్చే ఎన్నికల నాటికి కొత్త పార్టీ దిశగా కూడా ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు సాంస్కృతిక ఉద్యమం పేరుతో హడావిడి చేస్తున్నారు. రజనీ, పవన్ లతో కలిసి పనిచేస్తాననడం ద్వారా గద్దర్ మరోసారి చర్చకు తెరతీశారు.

గద్దర్ కు సొంతంగానే తెలుగురాష్ట్రాల్లో మంచి ఇమేజ్ ఉంది. ప్రజాగాయకుడిగా తిరుగులేని పేరుంది. ఇంత ఉండి కూడా ఇప్పటిదాకా ఆ ప్రజల కోసం గద్దర్ చేసింది ఏమీ లేదనే విమర్శ కూడా ఉంది. ఉద్యమ సమయంలో కేసీఆర్ తో కలిసి పనిచేసిన గద్దర్.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మాత్రం కూరలో కరివేపాకులా మిగిలిపోయారు. తనకు గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదన గద్దర్ మనసును తొలిచేస్తోందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

అందుకే పొలిటిల్ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని గద్దర్ భావిస్తున్నారు. అందుకోసం సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 200 నియోజకవర్గాల్లో సాంస్కృతిక ఉద్యమ ప్రచారం చేస్తామని చెప్పారు. తమ దగ్గర మంచి కార్యక్రమాల ప్లాన్ ఉందని, పవన్, రజనీకి ఉన్న ఫ్యాన్ బేస్ తో వీటిని ముందుకు తీసుకెళ్లగలిగితే.. దక్షిణాది ఆత్మగౌరవ పతాక రెపరెపలాడుతుందనేది గద్దర్ సూత్రం. మరి స్టార్లేమంటారో.

మరిన్ని వార్తలు:

ఆ భూతానికి పదేళ్లు.

బొత్స, ధర్మాన లకు జగన్ చెక్?