పెట్రోల్ మీద జీఎస్టీ వేస్తే మీ ఖర్చు తగ్గుతుందని తెలుసా?

Why do petrol and diesel prices not fall under GST?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జీఎస్టీ అంటే ఏమిటో పూర్తిగా అర్ధం కాకపోయినా కొన్ని రోజులుగా జనం నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. దేశ వ్యాప్తంగా ఒకటే పన్ను విధానం తీసుకొస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రభావం సామాన్యుడికి ఇంకా అంతుబట్టడం లేదు. కొద్ది రోజుల్లో ఖర్చు పెరిగిందో, తగ్గిందో అర్ధం చేసుకున్నాక గానీ సామాన్యుడి ప్రతిస్పందన బయటికి రాదు. అయితే ఆర్ధిక విషయాల్లో అవగాహన కలిగిన వాళ్ళు మాత్రం జీఎస్టీ లో మంచిచెడుల్ని విశ్లేషిస్తున్నారు. అన్నిటికి ఒకే పన్ను విధానం అంటున్న కేంద్రం పెట్రోల్ ని ఈ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదు అన్న కోణంలో ఓ మేధావి విశ్లేషణ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పెట్రోల్, డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకెళితే 50 శాతం ఖర్చు తగ్గుతుందని కూడా అర్ధం అవుతుంది. అదెలాగంటే …

ప్రస్తుతం పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వ ఎక్సయిజ్ పన్ను 23 శాతం. రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ పన్ను 34 శాతం. ఈ రెండు కలిపితే 57 శాతం. అంటే పెట్రోల్, డీజిల్ మీద మనం ఖర్చు పెట్టే ప్రతి 100 రూపాయల్లో 57 రూపాయలు ఈ రెండు పన్నుల కిందే పోతాయి. కానీ పెట్రోల్, డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఆ పన్ను కేవలం 28 శాతం. అంటే సగానికి సగం పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది. అందుకే కాబోలు అన్నిటికీ జీఎస్టీ అన్న కేంద్రం పెట్రోల్, డీజిల్ జోలికి వెళ్ళలేదు.

మరిన్ని వార్తలు 

కెసిఆర్ ఆరోగ్యం గుట్టు విప్పిన మనవడు.

రెండో తుగ్లక్ నిర్ణయం ..దేనికి ఎంత పన్ను వేస్తున్నారో తెలుసా మీకు ?

ఎకనమిక్ టైమ్స్ ను ఎక్కేసిన కేటీఆర్