ఎకనమిక్ టైమ్స్ ను ఎక్కేసిన కేటీఆర్

Telangana Minister KTR Serious On Economic Times For Negative News

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Telangana Minister KTR Serious On  Economic Times For Negative News

తెలంగాణను ఉద్దేశపూర్వకంగా తొక్కేస్తున్నారని కేటీఆర్ తెగ ఇదైపోతున్నారు. తెలంగాణలో మియాపూర్ ల్యాండ్ స్కామ్ పై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న తరుణంలో.. భూకుంభకోణం విలువ పదిహేను వేల కోట్లని సదరు పత్రిక చెప్పడం కేటీఆర్ కు కోపం తెప్పించింది. ఏమీ జరగలేదని ప్రభుత్వం ప్రకటించాక కూడా.. మళ్లీ మళ్లీ అదే స్కామ్ ను తవ్వడం, పైగా దాన్ని గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ కంపెనీలకు అంటగడ్డటం చీకాకు తెప్పిస్తోంది సర్కారురు.

కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఎకనమిక్ టైమ్స్ వ్యవహారం ఉందంటున్నారు కేటీఆర్. ప్రభుత్వ ప్రెస్ మీట్లు, కార్యక్రమాలకు ఆ పత్రిక బ్యూరో చీఫ్ ఎప్పుడూ హాజరుకాలేదని దెప్పిపొడిచారు. ల్యాండ్ స్కామ్ వ్యవహారంలోనే కాదు, తెలంగాణ ఏర్పడినప్పట్నుంచీ ఎకనమిక్ టైమ్స్ తీరు ఇలాగే ఉందని ఆడిపోసుకున్నారు కేటీఆర్.

ఎకనమిక్ టైమ్స్ అంటే దేశవ్యాప్తంగా మంచి పేరుంది. కేవలం స్కాముల లెక్కలు, ఆర్థిక గణాంకాలు మాత్రమే ఇవ్వడంలో ఆ పత్రిక పండిపోయింది. అలాంటి పత్రికలో వచ్చిన వార్తకు సరైన వివరణ ఇవ్వకుండా ఎదురుదాడి చేయడంపై గులాబీ వర్గాల్లోనే విస్మయం వ్యక్తవుతోంది. ఉద్యమ సమయంలో ఇంగ్లీష్ మీడియాను కోరి మరీ తెప్పించుకున్నారని, ఇప్పుడు అవసరం తీరిపోయినట్లు మాట్లాడుతున్నారనే వాదన కూడా ఉంది.

మరిన్ని వార్తలు:

బాబుని అడిగితే ఎన్టీఆర్ ఇస్తానంటున్నాడు.

అయ్యన్నకు తీరని అవమానం