ఈ ఫ్రైడే డ్రై డే.. డీజే కుమ్ముడే

dj-movie-will-record-collections-on-friday

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

DJ Movie Will Record Collections On Friday

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు అల్లు అర్జున్‌, పూజా హెగ్డేలు జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. అయినా కూడా మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. కారణం సినిమాకు పెద్దగా పోటీ లేక పోవడం. వారం రోజుల పాటు ‘డేజే’ కుమ్మేయడం ఖాయం మొదటి నుండి ప్రచారం జరిగింది. అన్నట్లుగానే మొదటి వారం దుమ్ము దుమ్ముగానే ‘డీజే’ వసూళ్లు సాధించింది. ఇక రెండవ వారం కూడా డీజేకు పోటీ లేదు, తిరుగు లేదు అని తేలిపోయింది. ఈ శుక్రవారం మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్దకు రాబోతున్నాయి. అందులో ఒక్కటి కూడా నోటెడ్‌ చిత్రం లేక పోవడంతో ప్రేక్షకులు డీజేనే ప్రిపర్‌ చేస్తారని ట్రేడ్‌ విశ్లేషకులు అంటున్నారు.

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న చిత్రాల్లో మొదటిది గంట రవి నటించిన జయదేవ్‌. ఈయన మొహాన్ని చూస్తుంటేనే సినిమా ఆడదని అనిపిస్తుంది. ఇక థియేటర్‌కు వెళ్లడం ఎందుకని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక సంపూర్నేష్‌బాబు ‘వైరస్‌’. ఈ చిత్రం కామెడీగా ఉంటే ఉండవచ్చు. కాని ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ సినిమాకు వెళ్లడం కష్టమే. అందుకే వైరస్‌ కూడా ఈ వారంలో పెద్దగా సత్తా చూపించదు. ఇక చివరిగా నయీం కథాంశంతో తెరకెక్కిని ఖయ్యూం భాయ్‌. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. అంటే మొత్తంగా మూడు సినిమాలను కూడా విడుదలకు ముందే చెత్త సినిమాలుగా ప్రేక్షకులు పరిగణిస్తున్నారు. సో ఈ వారం కూడా ఖచ్చితంగా ‘డీజే’ దూకుడు బాక్సాఫీస్‌ వద్ద బలంగానే ఉండే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు:

కె.ఏ . పాల్ తో ఎన్టీఆర్ కి పనిపడింది.

కాజోల్ కుటుంబం లో టాబు నిప్పులు?