సంపాదించడమే కాదు ఇవ్వడమూ తెలిసిన చౌదరి గారు.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Natco Pharma CEO Donates 30 crores to guntur govt hospital

నాట్కో… దేశీయంగానే కాదు అంతర్జాతీయంగాను పేరెన్నికగన్న ఫార్మా రంగ సంస్థ. వివిధ జబ్బులకు ఔషధాలు కనిపెట్టడంలో ఆ సంస్థ సాధించిన విజయాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఆ సంస్థ పిలిస్తే ఓ ఉద్యోగి ముందుగా ఓ ఏడాది శాలరీ అకౌంట్ లో వేస్తే నాట్కోలో చేరే విషయం ఆలోచిస్తా అన్నారట. కానీ ఇప్పుడు ఆ సంస్థలో ఉద్యోగం దొరికితే చాలు జీవితం సెటిల్ అనుకునేవాళ్లు లక్షల్లో వున్నారు. ఇదీ ఓ సంస్థగా నాట్కో సంపాదించుకున్న విశ్వసనీయత. అలాంటి సంస్థ గొప్పదనం వెనుక వున్న ఛైర్మన్ నన్నపనేని వెంకయ్య చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంపాదించడంలో కిక్ తెలిసిన వాళ్లకి అనుభవించడంలో సంతోషం తెలియదు. ఇక ఇవ్వడంలో, సంపద పది మందికి పంచడంలో ఆనందం,తృప్తి గురించి అంతకన్నా తెలియదు. ఇలా సంపాదించడం, అనుభవించడం, ఇవ్వడం లో ఆనందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించిన వ్యక్తి నాట్కో చౌదరి.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సరైన కాన్సర్ హాస్పిటల్ లేక రోగులు ఎంతగానో ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ పని చేయడానికి ముందుకు వచ్చింది మాత్రం నాట్కో చౌదరి గారే. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్సర్ చికిత్స విభాగం నెలకొల్పడానికి అక్షరాలా 30 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఆయన. ఇందులో 16 .5 కోట్లు వైద్యపరమైన మౌలికసదుపాయాల కోసమే ఖర్చు చేస్తున్నారు. ఇక ఇటీవలే ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి 15 లక్షల నాట్కో షేర్లు విరాళంగా ప్రకటించారు. వీటి విలువ దాదాపు 15 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. అయితే ఇదేదో కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగమని కొందరు పెదవి విరవచ్చు. కానీ నాట్కో చౌదరి గారు బయట ప్రపంచానికి తెలియకుండా చేసే సాయం ఎలా ఉంటుందో అక్కడ పని చేసే ఉద్యోగులకి బాగా తెలుసు. ఆ సంస్థలో పని చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు ఆయన చేసిన సాయం వింటే సాటి సంస్థలు ఆయన మీద దండయాత్ర చేయడం ఖాయం. ఆ స్థాయిలో ఆ కుటుంబాల్ని ఆదుకున్నారు ఆయన. పోయిన మనిషి ఉన్నా ఇంతగా చూసుకోలేరేమో అన్నంతగా నాట్కో నుంచి అడక్కుండానే వస్తున్న పరిహారాలు చూసి ఆ కుటుంబాలు నోరెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో. సంపాదించడంతో పాటు ఇవ్వడమూ తెలిసిన నాట్కో చౌదరి స్ఫూర్త్రిగా మరికొందరు ముందుకు వస్తే ఎన్నో ఇళ్లలో చీకట్లు తొలిగి వెలుగులు విరజిమ్ముతాయి. హాట్స్ ఆఫ్ చౌదరి గారు.