ఆగలేక పోతున్న ఎన్టీఆర్‌.. టెన్షన్‌లో బాబీ

jr ntr says to bobby make jai lava kusa movie fast

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏదైనా కొత్త పని ప్రారంభించాలంటే కొందరికి టెన్షన్‌గా ఉంటుంది, మరి కొందరికి ఆతృతంగా ఉంటుంది. ఆసక్తి ఉన్న పని చేయాలనుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఆ పని చేస్తామా అని ఉంటుంది. దాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తామా, ఎంత త్వరగా ఫలితం వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటి వరకు వెండి తెరపై సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్‌ త్వరలో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌ ‘బిగ్‌ బాస్‌’ షోకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. 

మరి కొన్ని రోజుల్లో ఆ షో షూటింగ్‌లో ఎన్టీఆర్‌ పాల్గొనబోతున్నాడు. ఈ సమయంలోనే ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘జై లవకుశ’ను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అందుకు దర్శకుడు బాబీని ఎన్టీఆర్‌ తొందర పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు వరకు షూటింగ్‌ పూర్తి అవ్వాల్సి ఉంది. కాని ఎన్టీఆర్‌ మాత్రం త్వరగా బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనాలే ఉద్దేశ్యంతో జులైలోనే సినిమాను పూర్తి చేయాలని బాబీని ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు సంబంధించి ఇంకా కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంది. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ ఒత్తిడి చేస్తుండటంతో బాబీ టెన్షన్‌కు గురవుతున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు

రంగస్థలం టైటిల్‌ ఎందుకు పెట్టారో తెలుసా?

కమెడియన్‌కు ఖరీదైన శిక్ష

కె.ఏ . పాల్ తో ఎన్టీఆర్ కి పనిపడింది.