టాలీవుడ్ జూనియర్‌ ఆర్టిస్ట్‌ అనుమానాస్పద మృతి…!

Cine Artist Arjun Goud Suicide In Ladge

హైదరాబాద్ లోని ఓ లాడ్జిలో జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల మేరకు, మంగా టిఫిన్‌ సెంటర్‌ ఎదురుగా ఉన్న హృదయ లాడ్జిలో అర్జున్‌ గౌడ్‌ (30) అనే యువకుడు, గత 20 రోజులుగా రూము అద్దెకు తీసుకుని ఉంటూ, సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడు.

suside-lodge

ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి షూటింగ్‌ ముగించుకొని లాడ్జికి వచ్చిన అర్జున్ గౌడ్, కొన్ని టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న అతని స్నేహితుడు నాగ కార్తీక్, అవి ఎందుకని అడుగగా, దగ్గు మాత్రలు వేసుకున్నానని చెప్పి పడుకున్నాడు. కానీ నేటి ఉదయం ఎంతకీ అతను నిద్ర లేవక పోవడంతో స్నేహితుడు 108కు సమాచారం అందించగా, పరీక్షించిన సిబ్బంది మృతి చెందినట్లు తెలిపారు. నాగకార్తీక్‌ ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అర్జున్‌గౌడ్‌ వేసుకున్న మాత్రల వివరాలపై ఆరా తీస్తున్న పోలీసులు అవి నిజంగానే దగ్గు మాత్రలా ? లేదా ఇంకేదైనానా అనే దర్యాప్తు చేస్తున్నారు.

suside-hrudiya-lodge