“హనుమాన్” రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది …

“హనుమాన్” రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది ...
Movie News

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ హీరో చిత్రం హనుమాన్. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే జనవరి 12, 2024 న మూవీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే.

“హనుమాన్” రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది ...
Hanuman Movie

ఇప్పటికే బడా మూవీ లు కూడా ఈ సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. అయితే రిలీజ్ డేట్ పై తాజాగా క్లారిటీ వచ్చింది.లేటెస్ట్ పోస్ట్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరొకసారి రిలీజ్ డేట్ ను మెన్షన్ చేశారు. హనుమాన్ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తుంది. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా కి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరబ్ లు సంగీతం అందిస్తున్నారు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.