కలర్స్ స్వాతితో పెళ్లి.. నవీన్ చంద్ర క్లారిటీ ఇచ్చాడు

కలర్స్ స్వాతితో పెళ్లి.. నవీన్ చంద్ర క్లారిటీ ఇచ్చాడు
Latest News

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు నటిగా గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. మొదట కలర్స్ ప్రోగ్రాం ద్వారా తన కెరియర్ను మొదలు పెట్టిన స్వాతి, ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలను అందుకుంది. ఇకపోతే మొదట్లో వరుసమూవీ లతో ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కాలంలో పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు అని చెప్పవచ్చు.

కలర్స్ స్వాతితో పెళ్లి.. నవీన్ చంద్ర క్లారిటీ ఇచ్చాడు
Naveen , Swat5hi

అయితే, త్రిపుర సినిమా ఫేమ్ నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. చిత్ర ప్రమోషన్స్ లో స్వాతితో పెళ్లి జరిగిందనే వార్తలపై నవీన్ స్పందించారు. త్రిపుర సినిమాలో స్వాతితో కలిసి పనిచేశానని చెప్పారు. సినిమా ప్రమోషన్స్ లో పెళ్లి దుస్తులో ఉన్న ఫోటో వైరల్ కావడంతో నిజంగా పెళ్లి అయిందనుకున్నారని తెలిపారు. తర్వాత చిత్ర పోస్టర్ గా అదే ఫోటోను విడుదల చేయడంతో క్లారిటీ వచ్చిందని చెప్పారు.