కుటుంబ కలహాలు….బెడ్ రూమ్ లో కెమెరాలు ఫిక్స్ చేసి !

cameras fixed in bedroom

కుటుంబ కలహాలతో ఓ భర్త క్రూరంగా ప్రవర్తించాడు. ఏకంగా బెడ్‌రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టాడు.. ఓ రోజు కెమెరాలు చూసి భార్య షాక్ తింది. నేరుగా వెళ్లి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. త్రిపురలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. జాతీయ మీడియా కథనం ప్రకారం త్రిపురలోని సాధిట్లాకు చెందిన రత్నా పొద్దర్‌కు, బాధిత మహిళకు మూడేళ్ల క్రితం వివాహమయ్యింది. కొద్ది రోజులుగా అత్తింటి వారు తనను వేధిస్తున్నట్లు మహిళ చెబుతోంది. అత్తామామలు, భర్త, ఆడబిడ్డలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటోంది. కట్నం వద్దని తనను పెళ్లి చేసుకున్నారని.. తర్వాత కట్నం కోసం తనను టార్చర్ చేస్తున్నారని ఆరోపించింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక తమకు ఉన్న భూమిని అమ్మి రూ.2లక్షలు ఇచ్చామని చెప్పింది. కట్నం ఇచ్చినా అత్తింటివారు వేధిస్తున్నారని ఇంకా డబ్బు కావాలని టార్చర్ పెట్టేవారని ఆవేదన వ్యక్తం చేసింది. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా హింసుస్తున్నారని తనపై భర్త కూడా అనుమానం పెంచుకున్నారని అందుకే బెడ్‌రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టించాడని ఆరోపిస్తోంది. తన అత్తింటివారి మీద చర్యలు తీసుకోవాలని ఆమె మహిళా కమిషన్‌ కు ఫిర్యాదు చేసింది. మరోవైపు బాధిత మహిళ భర్త వాదన మరోలా ఉంది, తన భార్యను కట్నం గురించి హింసించలేదని ఆమె తన తల్లిదండ్రుల్ని వేధిస్తోందని ఆరోపించారు. తన భార్యే అత్తమామల్ని కొద్దిరోజులుగా హింసిస్తోందని ఆమె తిరిగి తమపై దాడి చేస్తుందన్నాడు. అందుకే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటున్నాడు.