నాలుగు పెళ్ళిళ్ళ ప్రబుద్దుడు…ఐదో పెళ్ళికి ఒప్పుకోలేదని…నరికేసి ?

man killed woman because not accepted to fifth marriage

తనతో పెళ్లికి అంగీకరించలేదన్న ఆక్రోశంతో మహిళపై ఇప్పటికే నలుగురిని పెళ్ళిళ్ళు చేసుకున్న ఒక కామాంధుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటు చేసుకుంది. నిందితుడికి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు కాగా ఐదో వివాహం చేసుకునేందుకు భర్తతో విడిపోయి తల్లిదండ్రులో కలిసి ఉంటున్న మహిళను వేధించసాగాడు. అతడి మాట తిరస్కరించడంతో ప్రాణాలు తీసేందుకు ఒడిగట్టాడు. కుటుంబసభ్యులు సకాలంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. పత్తికొండ పట్టణంలోని ఆంజనేయనగర్‌కు చెందిన జయమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నాడు. భర్త చనిపోవడంతో ఆమె పిల్లలను పెంచి పెద్దచేసి ఇద్దరు కూతుళ్లకు వివాహాలు జరిపించింది. పెద్ద కుమార్తె వినతి భర్తతో విభేదాల కారణంగా పుట్టింట్లోనే ఉంటోంది. రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం బెంగళూరులోని మేనత్త ఉమ వద్దకు వెళ్లగా ఆమె రెండో భర్త రంగనాగరాజు వినత మీద కన్నేశాడు. తన కోరిక తీర్చాలని వేధించడంతో పాటు పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. రాజుకు అప్పటికే మూడు పెళ్లిళ్లు కాగా ఉమను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేక వనిత తల్లి దగ్గరకు తిరిగొచ్చేసింది. వనితపై మనసు చంపుకోలేకపోక నాగరాజు కూడా పత్తికొండకు మకాం మార్చేసి ఆమె ఇంటికి సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నాడు. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో వినత పత్తికొండలోని ఓ బట్టల షాపులో సేల్స్‌గర్ల్‌గా పనికి కుదిరింది. గురువారం సాయంత్రం షాపు నుంచి ఇంటికి వెళ్తున్న ఆమెను నాగరాజు అడ్డగించాడు. తనను పెళ్లి చేసుకోవాలని వేధించగా ఆమె తిరస్కరించి ఇంటికి వెళ్లేందుకు పరుగు తీసింది. ఆమెను వెంబడించిన నిందితుడు కొడవలితో తలపై నరికాడు. గాయంతో బాధపడుతూనే ఇంటికి వెళ్లి కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.