బ్రేకప్ చెప్పిన ప్రియుడు.. ‘అవి’ పగల కొట్టిన ప్రియురాలు!

lover said break up

తనకి కోపం తెప్పించిదని ప్రియురాలికి బ్రేకప్ చెప్పాడో ప్రియుడు. అయితే, ఆమె నుంచి అతడికి ఊహించని పరిస్థితి ఎదురైంది. ఫలితంగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అమెరికాలోని ఇల్లినాయిస్‌‌కు చెందిన 30 ఏళ్ల మహిళ, 43 ఏళ్ల వ్యక్తి సహజీవనం చేస్తున్నారు. ఓ రోజు ఆమె బాలిస్టిక్ వెళ్లింది. రోజంతా ఆమె అక్కడే గడపడంతో ప్రియుడికి అనుమానం కలిగింది. దీంతో ఆమెకు బ్రేకప్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆమె ఇంటికి రాగానే ఈ విషయంపై గొడవ పడ్డాడు. నీతో కలిసి ఉండను, విడిపోదామని అన్నాడు. అది నచ్చని ఆమె ఎంతగానో బతిమలాడుకుంది. అయినా అతను మంకు పట్టు పట్టడంతో ఆగ్రహానికి గురైన ఆమె అతడి వృషణాలను గట్టిగా పట్టుకుంది. వాటిని పట్టుకుని గట్టిగా లాగింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. కొద్ది సేపటి తర్వాత పరిశీలిస్తే వృషణాల సంచి పగిలిపోయి రక్తం కారింది. సుమారు ఆరు ఇంచులు పొడవునా చీలిన గాయంతో అతడు ఆసుపత్రిలో భర్తీ అయ్యాడు. ఈ సమాచారం తెలియగానే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. గృహహింస కింద కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన జూన్ 24న చోటుచేసుకుంది. ప్రస్తుతం జైలులో ఉన్న ఆమె బెయిల్ కావాలంటే రూ.34 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అందరూ ప్రియుడిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఫెమినిస్ట్లు మాత్రం  ప్రియురాలిని అనుమానించేవాడికి తగిన శిక్ష పడిందని అంటున్నారు.