మహేష్ మరియు బన్నీల మధ్య పోటీ

మహేష్ మరియు బన్నీల మధ్య పోటీ

గత కొంత కాలం నుంచి మెగాస్టార్ చిరంజీవి మరియు కొరటాల శివల కాంబోలో తెరకెక్కుతున్న “ఆచార్య” చిత్రంపై రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంది.అయితే ప్రస్తుతానికి షూటింగ్ అవుతున్న ఈ చిత్రం నుంచి ఒకటే కామన్ పాయింట్ ఎక్కువగా వినిపిస్తూ వస్తుంది.అదే సినిమాలోని ఒక కీలక పాత్రకు మహేష్ ఎంపిక అయ్యారని..ఇక్కడే రోల్ అయితే ఉంది కానీ దానికి ఎవరు ఫిక్స్ అయ్యారన్నది ఇంకా ఖరారు కాలేదు.దీనికి ముందు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ను అనుకున్నారు.కానీ తర్వాత అది కాస్త సూపర్ స్టార్ దగ్గరకు వచ్చింది.

కానీ ఇప్పుడు రేస్ లో బన్నీ కూడా ఉన్నాడని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బన్నీ మరియు మహేష్ లలో ఎవరొకరు ఈ రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఎవరు అన్నది ఫిక్స్ కాలేదని తెలుస్తుంది.అంతే కాకుండా ఈ రోల్ కు గాను మహేష్ 30 రోజుల షూటింగ్ ఫిక్స్ చేసుకోగా దానికి గాను రోజుకు 1 కోటి మొత్తం 30 కోట్లు డిమాండ్ చేసారని ఏవేవో వార్తలొస్తున్నాయి.ఇదే కానీ నిజమైతే వసూళ్ల సంగతి ఏమో కానీ బడ్జెట్ మాత్రం తడిసి మోపెడు కావడం ఖాయం అని చెప్పాలి.మొత్తానికి మాత్రం మహేష్ మరియు బన్నీల మధ్య పోటీ అయితే నిజమే అని తెలుస్తుంది.