ఏపీలో లాక్ డైన్ కానీ… నెల్లూరులో మాత్రం కాదు…

ఏపీలో లాక్ డైన్ కానీ... నెల్లూరులో మాత్రం కాదు...
కరోనా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా లాక్ డౌన్ ప్రకటించారు. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. కానీ.. నెల్లూరులో మాత్రం సీన్ రివర్స్ లో కొనసాగుతోంది. రోజువారీ రద్దీ ఎలా వుంటుందో సింహపురిలో అలాగే ఉందని తెలుస్తోంది. ఈ నెల 31వరకు కూడా ఏపీ మొత్తం లాక్ డౌన్ నిర్ణయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అందరూ కూడా దీన్ని విధిగా పాటించాలి అని.. ఎక్కడా కూడా పబ్లిక్ గానీ ప్రైవేటు ట్రాన్సపోర్ట్ గానీ… పని చేయవు.. బయటకు వాహనాలు కూడా రాకూడదని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

అదేవిధంగా నెల్లూరు నగరంలో మాత్రం ఉదయం నుంచి ట్రాఫిక్ యథావిధిగా కనబడుతోంది. రోజు వారీగా ఏ విధమైన వాహన రద్దీ ఉంటుందో ప్రస్తుతం కూడా అదే విధమైన వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ప్రతి ఒక్కరు రోడ్డుపైకి వస్తున్నారు. అందరూ నిత్యావసర వస్తువుల కోసం అని చెబుతున్న కూడా.. ఒక కూరగాయల మార్కెట్, నిత్యావసర సరుకులు లభించే దుకాణాలే కాకుండా మిగిలిన చోట కూడా రద్దీ విపరీతంగా ఉందని తెలుస్తోంది. దీంతో అధికారులు వారందరినీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వచ్చే వాహనాలను అడ్డకుంటున్నారు. ఎవరూ కూడా రోడ్డు పైకి రాకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దుకాణాలను కూడా మూసేయించారు.