చైనాలో మళ్లీ కరోనా విజృంభన

చైనాలో మళ్లీ కరోనా విజృంభన

చైనాలో తాజాగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం వందలకొద్ది విమానాలను రద్దు చేయడం, పాఠశాలలను మూసివేయడం వంటి కఠిన ఆంక్షలను విధించింది. అంతేకాదు చైనా దేశవ్యాప్తంగా సార్స్‌-కోవీ-2కి సంబంధించిన సాముహిక పరీక్షను కూడావేగవంతం చేయనుంది. అయితే ఇతర దేశాలు మాదిరిగా కాకుండా చైనా మాత్రం ఇంకా లాక్‌డౌన్‌ని కొనసాగించడమే కాక పొరుగుదేశాలతో ఉన్న సరహద్దులను కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.

క్రాస్‌ ప్రావిన్షియల్‌ పర్యటనలో ఉన్న ఏడుగురు వృద్ధ బృందానికి నిర్వహించిన కోవిడ్‌ -19 పరీక్షలో కేసులు వెలుగు చూశాయి. పైగా ఈ వృద్ధ బృందం జియాన్, గన్సు ప్రావిన్స్, మంగోలియాకు వెళ్లే ముందు షాంఘైని కూడా సందర్శించారు. దీంతో బీజిగ్‌తో సహా కనీసం ఐదు ప్రావీన్స్‌లు కరోనా ప్రభావం ఉండోచ్చని చైనా ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు గత కొన్ని రోజులగా ఉత్తర వాయువ్య ప్రాంతాల నుంచి కొత్త కేసులు నమోదవుతున్న‍ట్లు కూడా చైనా గుర్తించింది. అయితే చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ గురువారం నాటికి తాజాగా 13 కోవిడ్‌ -19 కేసులు నమోదైనట్లు పేర్కొంది.