స్వీట్స్ తినకుండా ఉండడం కొంచెం కష్టమే

స్వీట్స్ తినకుండా ఉండడం కొంచెం కష్టమే

ఆయుర్వేద నిపుణులు మాట్లాడుతూ, “పండుగలలో మన నోటిని స్వీట్స్ తినకుండా అదుపులో ఉంచుకోవడం కొంచెం కష్టమే అందుకే స్వీయ నియంత్రణను కలిగి ఉండటం కష్టమవుతుంది, కానీ మీరు బ్యాలన్స్‌గా ఉండటానికి ప్రయత్నిస్తే, తరువాత సమస్య అంతగా ఉండదు,” అంటున్నారు.

ఫుడ్ క్రేవింగ్స్ ఎప్పుడు సరైన టైమ్‌లో రావు. అంటే, ఉదయమే ఎనిమిదింటికి ఉప్మా మీదకో, దోశ మీదకో మనసు పోదు. అప్పుడు పీజా కావాలనిపిస్తుంది. ఫుల్‌గా డిన్నర్ చేసిన తరువాత ఇంకా ఏమైనా తినాలనిపిస్తుంది. ఇది విచిత్రంగా ఉంటుంది కానీ, ఇలాంటి ఫుడ్ క్రేవింగ్స్ రెగ్యులర్‌గా ఉన్నాయంటే అర్ధం మన బాడీ మనకి ఒక సిగ్నల్ ఇస్తోందని.

స్వీట్స్ లేదా షుగర్ ఫుడ్స్ తినే వారికి ఒక పరిమితం అంటూ ఉండదు.. ముఖ్యంగా, ఇండియా వంటి దేశంలో స్వీట్ డిష్ లేనిదే భోజనం ముగయదు. భోజనంలో కానీ, శుభకార్యానికి కానీ రుచికరమైన స్వీట్ అందివ్వాల్సిందే.. మరీ ఇలాంటి వారిని స్వీట్ తినకండి అని చెప్పలేము. లేదా స్వీట్ తినకూడదని చెప్పడం కూడా కష్టమే.

స్వీట్స్ తినకూడదని ఎంత కంట్రోల్ చేయాలన్నా మీ వల్ల కావట్లేదనేట్లైతే , ఇక్కడ కొన్ని షుగర్ కర్వింగ్ ఫుడ్స్, స్వీట్స్ తినాలనే కోరికను న్యాచురల్‌గా తగ్గించే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి..ఫుడ్ క్రేవింగ్ కి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏమిటో, వాటిని ఎలా ఓవర్ కమ్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

సరైన నిద్ర లేకపోవడం, నిద్ర సరిపోకపోతే హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. ఈ ఇంబాలెన్స్ ఎనర్జీ లెవెల్స్ కోసం ఇంకా ఎక్కువ తినమని మనని ఫోర్స్ చేస్తుంది.విటమిన్ డెఫిషియన్సీ ఉండడం, మీ బాడీకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఫ్యాట్, మెగ్నీషియం, కాల్షియం వంటి న్యూట్రియెంట్స్ మీ ఫుడ్ ద్వారా అందకపోతే బాడీ అవి ఎలా అందుకోవాలో చూస్తుంది.

డీ-హైడ్రేషన్, దాహం వేసినప్పుడు కూడా మనకి తినాలనే అనిపిస్తుంది. అందుకే బాడీకి కావలసినంత నీటిని అందిస్తూ ఉంటే ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు.స్ట్రెస్ ఎక్కువైనప్పుడలా స్వీట్స్ తినాలని అనిపిస్తుంది. బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఇంకేదైనా యాక్టివిటీ వైపు మనసు మరల్చుకుంటే ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయవచ్చు.

తొందరపడి తినడం అనేది కొంచెం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా పండుగలలో అదుపులో ఉండడం కష్టమే, కానీ ఎక్కడ ఎక్కువగా తినడానికి ఇష్టపడ్తున్నామో తెలుసుకోవడం ద్వారా కోరికలు అదుపు చేసుకోవచ్చు.మొదటి బ్రేక్ ఫాస్ట్ అత్యంత పోషకమైనదిగా చేయడం వలన తీపి తినాలని.. రుచికరమైన కోరికలు రెండూ తగ్గుతాయి.

ఆహారం కోసం నియంత్రిత రహస్యం ఏమిటంటే, మీ భోజనాన్ని నిర్వహించడం మరియు నిర్ణీత సమయాల్లో మాత్రమే తినడం. ఎప్పుడుబడితే అప్పుడు తినడం కూడా అంత మంచిది కాదు.ఇది మీకు ఆహార కోరికలను నియంత్రించడంలో పూర్తిగా సహాయపడకపోవచ్చు, కానీ మీ కోరికలు బలంగా ఉన్న రోజు సమయాన్ని గుర్తించడంలో ఇది మీకు సహాయపడుతుంది.

ప్రయత్నించిన నిజమైన వాటికి ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వలన, మీరు కేలరీలను లెక్కించడంలో సహాయపడవచ్చు, కానీ ఇది మీకు సంతృప్తికరంగా ఉండదు. ఆ యాదృచ్ఛిక ఆహార కోరికలను ఆపడానికి ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు లేదా వెరైటీ వంటకాలు ప్రయత్నించండి.