Crime: రూ.20 లక్షల విలువ చేసే 2 కిలోల అల్ఫ్రాజోలం పత్తివేత

Crime: 2 kg alfrazolam worth Rs. 20 lakh cotton picker
Crime: 2 kg alfrazolam worth Rs. 20 lakh cotton picker

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో తనిఖీలు నిర్వహించగా రూ.20 లక్షల విలువ చేసే 2 కిలోల అల్ఫ్రాజోలం పట్టుబడింది. నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ కార్యాలయంలో నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డిలోని ఓ హోటల్‌ వద్ద నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి సోదాలు నిర్వహించగా కల్తీకల్లు తయారీలో వినియోగించే రెండు కిలోల అల్ఫ్రాజోలం దొరికింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో సుదర్శన్ అక్కడి నుంచి పారిపోయాడు.

మరోవ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లా లాడ్ను గ్రామానికి చెందిన భవానీసింగ్గా గుర్తించారు. రాజస్థాన్కు చెందిన ముఖేష్సింగ్ వద్ద దీనిని కొనుగోలు చేసి హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లికి చెందిన సుదర్శన్కు విక్రయిస్తున్నట్లు నిందితుడు ఒప్పుకొన్నాడు. నిందితులపై మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు. దాడుల్లో సహాయక ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి చంద్రభాను నాయక్, సీఐలు స్వప్న, వెంకటేశ్, ఎస్సైలు విక్రమ్కుమార్, నర్సింహాచారి, సిబ్బంది రాజన్న, హమీద్, ఉత్తమ్, శివ, విష్ణు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.