జోరుమీదున్న స్టాక్‌ మార్కెట్‌

జోరుమీదున్న స్టాక్‌ మార్కెట్‌

అంతర్జాతీయ మార్కెట్‌ సూచీలు సానుకూలంగా ఉండటంతో దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జోరుమీదున్నాయి. గత వారం రోజులుగా కొనసాగుతున్న నష్టాలతో చాలా షేర్ల ధరలు కనిష్టాలకు చేరుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు భారీ ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బుధవారం మార్కెట్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు లాభాల బాటలో ఉన్నాయి.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58,163 పాయింట్ల దగ్గర ప్రారంభం అయ్యింది. ఉదయం 10 గంటల సమయానికి 527 పాయింట్లు లాభపడి 58,335 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 168 పాయింట్లు లాభపడి 17,434 పాయింట్ల దగ్గర కొసాగుతోంది. ఐటీ షేర్లు పుంజుకోవడంతో మరోసారి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58 వేల పాయింట్ల మార్క్‌ను దాటింది.

ఈ రోజు ఉదయం మార్కెట్‌లో టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, మారుతి సుజూకి, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌, టైటాన్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, భారతి ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు నిఫ్టీ 1 శాతం వృద్ధి నమోదు చేయగా నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ షేర్లు 1.50 శాతం వృద్ధి నమోదు చేశాయి.