దర్శకుడు’ సుకుమార్‌ రియల్‌ లైఫ్‌ స్టోరీ..!

Darshakudu Movie Story Director Sukumar's Real Life Story

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా ‘రంగస్థలం 1985’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఒక వైపు సినిమాలు తెరకెక్కిస్తూనే మరో వైపు నిర్మాణంలో కూడా తన సత్తా చాటుతున్నాడు. వైవిధ్యభరిత కథలను తయారు చేస్తూ చిన్న చిత్రాలుగా నిర్మిస్తున్నాడు. ‘కుమారి 21ఎఫ్‌’ చిత్రాన్ని నిర్మించి ప్రశంసలు పొందిన సుకుమార్‌ తాజాగా ‘దర్శకుడు’ అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమాకు కథను సుకుమర్‌ అందించాడు. ఒక యువకుడు దర్శకుడు అయ్యేందుకు పడే తపన, పడ్డ కష్టం ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. విడుదలకు సిద్దం అయిన ఆ సినిమా గురించి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికర విషయం చర్చ జరుగుతుంది. 

లెక్కల మాస్టర్‌ అయిన సుకుమార్‌ ఇండస్ట్రీకి వచ్చేందుకు చాలా ఇబ్బందులు పడ్డాడు. తన ఇబ్బందులనే దర్శకుడు సుకుమార్‌ కథ రూపంలో రాసుకున్నాడని, దాన్ని అంతా కొత్త వారితో నిర్మించాడు అని తెలుస్తోంది. సుకుమార్‌కు దిల్‌రాజు అవకాశం ఇచ్చాడు. అంతకు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ ఇబ్బందులు ఏంటి, తాను కథలను ఎలా తయారు చేసుకుంటాను, మొదటి ఛాన్స్‌ ఎలా వచ్చింది అనే విషయాలను సుకుమార్‌ ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీలోని ఒక అగ్ర దర్శకుడు సుకుమార్‌ను ఎలా చీట్‌ చేశాడు అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో చూపించనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ దర్శకుడు ఎవరై ఉంటారు అనేది ఏ ఒక్కరికి తెలియదు. సినిమా విడుదలైతే కాని అసలు మ్యాటర్‌ ఏంటి అనేది క్లారిటీ రాదు.

మరిన్ని వార్తలు

అనుష్క బరువు కారణంగా ‘సాహో’..!

సంజయ్ గాంధీకి పెళ్ళికి ముందే కూతురుందా ?