అనుష్క బరువు కారణంగా ‘సాహో’..!

Anushka Replaced Saaho Movie Due to Heavy Weight

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘బాహుబలి’ చిత్రం తర్వాత మరోసారి ప్రభాస్‌ మరియు అనుష్కలు ‘సాహో’ చిత్రంలో కలిసి నటించబోతున్నారు అనేది గత కొన్నాళ్లుగా మీడియాలో వినిపిస్తున్న వార్త. బాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు పలు భాషల హీరోయిన్స్‌ను సంప్రదించిన తర్వాత పలువురు హీరోయిన్స్‌ను పరిశీలించిన తర్వాత చివరకు అనుష్కనే ప్రభాస్‌కు జోడీగా ఎంపిక చేయాలని భావించారు. అయితే అందుకు అనుష్క బరువు అడ్డు వచ్చింది. ‘సాహో’ చిత్రంలో ప్రభాస్‌ చాలా బక్కగా కనిపించబోతున్నాడు. బక్కగా కనిపించే ప్రభాస్‌ సరసన లావుగా ఉండే అనుష్క ఎలా సెట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆలోచనలో పడ్డారు.

అనుష్క కనీసం ఏడు లేదా ఎనిమిది కేజీలు తగ్గితే ప్రభాస్‌తో ‘సాహో’ సినిమాలో నటించే అవకాశం ఉండేది. కాని చాలా రోజులుగా అనుష్క తగ్గే ప్రయత్నం చేస్తున్నా తగ్గలేక పోతుంది. దాంతో చేసేది లేక అనుష్క స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోవాలని భావించారు. ఇంకా హీరోయిన్‌ ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు. ప్రభాస్‌, అనుష్కల కాంబోకు ఇప్పటికే సక్సెస్‌లు దక్కాయి. మరోసారి ‘సాహో’లో నటిస్తే తప్పకుండా సక్సెస్‌లు రావడంతో పాటు, అనుష్క క్రేజ్‌ మరింత పెరిగేది అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. అయితే అనుష్క మాత్రం ఆ అవకాశాన్ని కోల్పోయింది.

మరిన్ని వార్తాలు

బిగ్‌బాస్‌ షోపై మంచు లక్ష్మి క్లారిటీ

ఎన్టీఆర్ ని దేవా కి కాకుండా చేస్తున్న వర్మ ?