ఎన్టీఆర్ ని దేవా కి కాకుండా చేస్తున్న వర్మ ?

varma inturpting deva katta for doing ntr biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆర్భాటంగా ప్రకటన అయితే చేశారు గానీ ఆ సినిమాలో హీరో ఎవరన్నది ఇంకా బయటికి రాలేదు. వర్మ చేసిన హడావిడి చూస్తే అందులో హీరో బాలయ్య అనిపించింది. అంతకుముందు దాకా ఎన్టీఆర్ బయోపిక్ గురించి బాగా ఇంటరెస్ట్ గా మాట్లాడిన బాలకృష్ణ, వర్మ ప్రకటన తర్వాత సైలెంట్ అయ్యారు. ఆయన నోరు విప్పితే గానీ వర్మ హీరో ఎవరో తెలిసేది. కానీ ఫిలిం నగర్ లో ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త హల్ చెల్ చేస్తోంది.

ఎన్టీఆర్ బయోపిక్ తీయాలి అనుకున్నప్పుడు బాలయ్య ఎంతోమంది దర్శకుల పేర్లు పరిశీలించారట. అందులో ఒకరు దేవా కట్టా. ఈ దర్శకుడు తీసిన ప్రస్థానం సినిమా బాలక్రిష్ణని బాగా ఆకట్టుకుందట. అప్పట్లో ఈ సినిమా చూసిన బాలయ్య దేవా కి ఫోన్ చేసి అభినందనలు తెలిపాడట. ఆ సినిమా బాగా తీశావని ప్రశంసలు కురిపించాడట. అదే చనువుతో ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ గురించి వర్క్ చెయ్యమని దేవా తో బాలయ్య అన్నట్టు తెలుస్తోంది. తీరా వర్క్ పూర్తి అయ్యేసరికి వర్మ ఎన్టీఆర్ బయోపిక్ నేనే తీస్తానంటూ బయలుదేరడంతో దేవా పరిస్థితి ఏమిటో అర్ధం కావడం లేదు. బాలయ్య అనుమతితో వర్మ ఈ ప్రకటన చేశాడా లేక ఆయనే స్వయంగా చేశాడా అన్నది దేవా కూడా తేల్చుకోలేకబోతున్నాడట. అందుకే బాలయ్య ఎప్పుడు నోరు విప్పుతాడా, ఈ సస్పెన్స్ కి ఎప్పుడు తెర పడుతుందా అని ఎన్టీఆర్, బాలయ్య ఫాన్స్ తో పాటు దేవా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడట.

మరిన్ని వార్తాలు

సమంత మాకు అదృష్టం

నిన్నటి వరకు ఐశ్వర్య.. ఇప్పుడు సోనాక్షి కూడా